నేటి నుంచి గెజిటెడ్ పోస్టుల మెయిన్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్ పరీక్షలు ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి.
అసిస్టెంటు బీసీ, సోషల్‌వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (ఏపీ మైనింగ్), సివిల్ అసిస్టెంటు సర్జన్, టెక్నికల్ అసిస్టెంటు (ఏపీపీటీఓ), అసిస్టెంటు డెరైక్టర్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), అసిస్టెంటు కెమిస్ట్ (గ్రౌండ్‌వాటర్ సర్వీస్), టౌన్‌ప్లానింగ్ అసిస్టెంటు (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పోస్టులకు సంబంధించి ఈ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు.
Published date : 21 Sep 2020 03:35PM