Skip to main content

నేటి నుంచి ఆయుష్‌ మాప్‌అప్‌ కౌన్సెలింగ్‌: కాళోజీ ఆరోగ్య వర్సిటీ

సాక్షి, హైదరాబాద్‌: యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మాప్‌అప్‌ వెబ్‌కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), నేచురోపతి–యోగా (బీఎన్వైసీ), యునాని (బీయూఎంఎస్‌) కోర్సుల్లో ఖాళీ సీట్లను ఈ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మార్చి 6న మధ్యాహ్నం 1 గంట నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ ఓ ప్రకటనలో కోరింది. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs. telangana.gov.in  ను చూడాలని సూచించింది.
Published date : 06 Mar 2021 04:20PM

Photo Stories