Skip to main content

నేడు జగనన్న విద్యా కానుక ప్రారంభం: వారం రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక గురువారం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందనుంది.

ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్‌లు అందజేయనున్నారు. పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో ‘డ్రాప్ అవుట్ఙ్ లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోంది.

42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి

  • రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు.
  • 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు.
  • స్కూల్ కిట్‌కు సంబంధించిన వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్, ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో సేకరించారు.
  • కోవిడ్ నేపథ్యంలో ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల పాటు కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే కిట్లు చేరాయన్నారు. కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయెమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు.
  • ఏవైనా సమస్యలు ఎదురైతే 9121296051, 9121296052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలన్నారు.

జగనన్న విద్యా కానుక కింద పంపిణీ చేసే వస్తువులు
, విద్యార్థులు

వస్తువు పేరు

వస్తువుల సంఖ్య

విద్యార్థుల సంఖ్య

మొత్తం వస్తువులు

స్కూల్ బ్యాగ్

ఒకటి

42,34,322

42,34,322

ఏకరూప దుస్తులు

3 జతలు

42,34,322

1,27,02,966

బూట్లు

ఒక జత

42,34,322

42,34,322

సాక్సులు

2 జతలు

42,34,322

84,68,644

బెల్ట్

ఒకటి

31,40,836

31,40,836

నోట్ బుక్స్

ఒక సెట్

20,33,225

2,19,53,724

పాఠ్య పుస్తకాలు

ఒక సెట్

42,34,322

3,13,33,982


పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో శ్రీకారం
జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Published date : 08 Oct 2020 02:05PM

Photo Stories