‘నాడు–నేడు’తో మారిన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు
Sakshi Education
పక్క చిత్రంలోని ఎల్.కోట ఎంపీపీ స్కూలు విజయనగరం జిల్లా లక్కవరపు కోటలోనిది.. అదీ ఊరికి మధ్యలో ఉంది. ప్రహరీ లేకపోవటంతో పందులు, కుక్కలు, పశువులు ఆవరణలోకి వచ్చేసేవి.
రాత్రిళ్లు తాగుబోతులు, తిరుగుబోతులకది అడ్డా!. ఇక్కడి హెచ్ఎం సింహాద్రి సత్యవతి మాటల్లో చెప్పాలంటే... ‘‘ఉదయం రాగానే మేం చేసే మొదటిపని చెత్త, మద్యం సీసాలు ఎత్తేయించడం, పందులు, కుక్కలు పాడుచేస్తే కడిగించటం. దానికే సగం సమయం పోయేది. కానీ ‘నాడు–నేడు’ పుణ్యమాని రూ.17 లక్షల నిధులతో బడి రూపురేఖలు మార్చారు. రంగుల తోరణంలాంటి ప్రహరీ వచ్చింది. సౌకర్యాలూ వచ్చాయి. ఉన్న 72 మంది పిల్లలకు తోడు మరింత మంది చేరుతున్నారు. పిల్లలు బాగుపడే రోజులొచ్చాయి.’’ స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి స్కూలూ.. ప్రతి విద్యార్థీ.. టీచర్లూ ఇదే విధంగా తమ బడి వైభవాన్ని కళ్లకు కడుతున్నారు.
చదవండి: ఇక 1,180 పోస్టుల భర్తీకి చకచకా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
చదవండి: ఏయూ ఇంటర్నేషనల్ ఎంబీఏ.. దరఖాస్తు గడువు ఆగస్టు 20 వరకు పెంపు
చదువు విలువ తెలియనిదెవ్వరికి? విలువ తెలుసు కనకే.. మంచి చదువు, నాలుగింగ్లీషు ముక్కల కోసం నిరుపేదలూ వీధి చివరి కాన్వెంట్లకు వెళ్లారు. తలకు మించిన అప్పులూ చేశారు. ‘విలువ’ తెలుసు కనకే.. శ్రీమంతులు దీన్ని వ్యాపారం చేశారు. సామ్రాజ్యాలు నిరి్మంచారు. ‘విలువ’ తెలుసు కనకే గత ప్రభుత్వాలు వీరికి సాగిలపడ్డాయి. ఫలితం... అక్కడక్కడా అప్పుడప్పుడు మెరిసిన నక్షత్రాలు తప్పితే...అందరికీ నాణ్యమైన చదువనేది ఇప్పటికీ అందనిదే!!.
చెట్లకింద క్లాసులు... బల్లలు కాదు కదా! బోర్డులూ లేని తరగతులు... ఎండకు, వర్షానికి పనికిరాని భవనాలు... ఆనవాళ్లు లేని ప్రహరీలు... బాత్రూమ్కైనా, మంచినీళ్లకైనా ఇంటికి పరుగెత్తే పిల్లలు.. సంఖ్యకు తగ్గట్టుగా లేని టీచర్లు... కాన్వెంట్లో తప్ప ఇంగ్లిష్ దొరకని సిలబస్!!. చెప్పాలంటే ప్రభుత్వ స్కూళ్లు ఎదుర్కొన్న సమస్యల్లో ఇవి కొన్నే. వీటిని పరిష్కరించే చిత్తశుద్ధి మాత్రం గత ప్రభుత్వాలు చేస్తే ఒట్టు!!. ‘చదువు విలువ తెలిసిన వాడిగా చెబుతున్నా’ అనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం చేపడుతూనే స్కూళ్లపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’ పేరిట ప్రతి స్కూలునూ మార్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తేవటమే కాదు... ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకూ ఆరి్థక ఆసరా కల్పించారు. బళ్లు మొదలైనరోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేస్తున్నారు.
నిజానికి వేరొక ప్రభుత్వంలో అయితే... ఇలాంటివన్నీ వాగ్దానాలు, భవిష్యత్తులో చేస్తారన్న ఆశలుగానే ఉండేవి. అలాగే మిగిలిపోయేవి కూడా!!. కానీ సీఎం జగన్ మాటలకన్నా... చేతలనే నమ్ముతారు. కాబట్టే చేసి చూపించారు. అందుకే తొలివిడతగా రాష్ట్రంలో ఇపుడు 15,715 స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఏకంగా రూ.3,900 కోట్లతో... సమగ్ర మౌలిక సదుపాయాలతో, అందంగా ముస్తాబయ్యాయి. పిల్లల్ని రారమ్మంటున్నాయి. ఈ నెల 16న తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇపుడు ప్రతి స్కూలూ... ప్రతి విద్యార్థీ... తల్లిదండ్రులూ... టీచర్లూ ఓ కథ చెబుతున్నారు. తమ బడి వర్తమాన వైభవాన్ని కళ్లకు కడుతున్నారు.
మంచి చదువులకు మార్గం సుగమం
వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంది. గతంలో స్కూళ్లల్లోని పరిస్థితిని ఫొటోలు తీయించి అవే స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా... రాష్ట్రంలో 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను ‘మనబడి నాడు–నేడు’ జాబితాలో చేర్చింది. దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే ఈ కార్యక్రమంలో తొలివిడతగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసింది. వాటిలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.3,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి దాదాపు పూర్తి చేయించింది. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్కూళ్లను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు వేరెక్కడా లేవన్నది విద్యా రంగ ప్రముఖుల మాట. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పేదలకు అత్యుత్తమ చదువులను అందుబాటులోకి తేవాలన్న సీఎం జగన్ సంకల్ప యజ్ఞంలో తొలి ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది.
ప్రతి స్కూలుకూ ప్రహరీ

- ఒకప్పుడు స్కూలుకు ప్రహరీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ప్రతీ స్కూలుకు ప్రహరీ నిర్మించడమే కాకుండా ఆవరణలో అందమైన మొక్కల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు.
- విద్యార్థి స్కూలులో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన వసతులు కల్పించింది. గతంలో స్కూల్ భవనాలు ఎప్పుడు పడిపోతాయో అన్నట్లుగా శిథిలావస్థలో ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించింది.
- చిన్న చిన్న పనులతోపాటు పెద్ద పనులు కూడా పూర్తి చేయించి పాఠశాల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చి వేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ప్రతి స్కూల్లోనూ అదనపు తరగతి గదులను నిరి్మంచింది.
- ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే రీతిలో పాఠశాలలకు ఆహ్లాదకరమైన రంగులను వేయించింది.
- ఈ రంగుల కోసం దాదాపు రూ.412 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే 14,500 స్కూళ్లలో రంగుల కార్యక్రమం పూర్తయింది.
చేపట్టిన పనులు | పనుల సంఖ్య | నిధులు (రూ.లక్షల్లో) |
తరగతి గదులు (నాబార్డు) | 425 | 44,063.74 |
పెయింటింగ్ | 14,437 | 41,232.14 |
రిపేర్లు | 14,983 | 81,117.59 |
తరగతి గదుల నిర్మాణం (పీసీల ఆధ్వర్యంలో) | 60 | 3,126.91 |
ప్రహరీల నిర్మాణం | 555 | 2,413.48 |
Published date : 13 Aug 2021 02:08PM