మే నెలాఖరు వరకు పోస్ట్‌మెట్రిక్ ఉపకార నమోదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పోస్ట్‌మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
మే 31వ తేదీ వరకు ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించేందుకు వెసులుబాటు ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌మెట్రిక్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణను గతేడాది ఆగస్టు నుంచి గడువు తేదీని పలుమార్లు పొడిగిస్తూ చివరకు మార్చి నెలాఖరు వరకు అవకాశమిచ్చింది. అయినప్పటికీ 2 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికీ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. ఈ పరిస్థితిని పరిశీలించిన సంక్షేమ శాఖలు ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. దీంతో స్పందించిన రాష్ట్రప్రభుత్వం చివరి అవకాశంగా దరఖాస్తుల గడువు పెంచింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజీ యాజమాన్యాలు కూడా ఈపాస్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోలేదు. దీంతో తాజాగా వచ్చేనెలాఖరు వరకు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా రాష్ట్రప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించింది.
Published date : 17 Apr 2021 03:23PM