Skip to main content

మధ్యాహ్న భోజనంపై జిల్లాల్లో గ్రీవెన్స్ సెల్

సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాల్లో గ్రీవెన్స్ సెల్స్‌ను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ రమణకుమార్ డీఈవోలను ఆదేశించారు.
అన్ని జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఫిర్యాదుల పరిష్కార విభాగాలు ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, వంట ఏజెన్సీలు ఎవరైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసేందుకు డీఈవోల మెయిల్ ఐడీలను సంబంధిత జిల్లాల్లోని అన్ని పాఠశాలల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. పాఠశాల విద్య కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా (mdmtsyahoo.com) ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఎంఈవోలు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఫిర్యాదులను, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే పంపించాలని పేర్కొన్నారు.
Published date : 08 Feb 2020 04:12PM

Photo Stories