లోకాయుక్తలో 49 పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లోకాయుక్త పరిధిలో 49 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. లోకాయుక్త డెరైక్టర్ నుంచి కార్యాలయంలో స్వీపర్ వరకు మొత్తం 17 స్థాయిల్లో ఈ పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
డెరైక్టర్ (లీగల్), డిప్యూటీ డెరైక్టర్ (లీగల్), లోకాయుక్త కార్యదర్శి, ఉప లోకాయుక్త కార్యదర్శి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, దర్యాప్తు అధికారి పోస్టులతో పాటు సెక్షన్ ఆఫీసర్లు, స్టెనోలు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, కానిస్టేబుల్, జమేదార్, గార్డెనర్, స్కావెంజర్ కమ్ స్వీపర్ పోస్టులు ఉన్నాయి. డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్, లోకాయుక్త కార్యదర్శి పోస్టులతో పాటు ఆఫీస్ సబార్డినేట్లలోని 15 పోస్టుల్లో 5 పోస్టులు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని, మిగిలిన పోస్టులు ఉత్తర్వులు వచ్చిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 20 Nov 2020 04:09PM