కశ్మీర్‌లో మళ్లీ ప్రారంభమైన స్కూళ్లు!
Sakshi Education
శ్రీనగర్: దాదాపు 7 నెలల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పాఠశాలలు తెరుచుకున్నాయి.
ఫిబ్రవరి 24 (సోమవారం)న నుంచి బడులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. 370 అధికరణ, జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి వంటి వివాదల కారణంగా గతేడాది స్కూళ్లను మూసివేశారు. యూనిఫాం లేకుండానే పాఠశాలలకు రావచ్చని పాఠశాలలు ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్నిరకాల చర్యలు తీసుకున్నామని జమ్ముకశ్మీర్ విద్యాశాఖ డెరైక్టర్ మహహ్మద్ యూనస్ మాలిక్ ప్రకటించారు. అయితే శ్రీనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, కశ్మీర్ డివిజన్‌లో ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు.
Published date : 25 Feb 2020 01:53PM