కరోనా అదుపులోకి వస్తే ఈ స్కూళ్లకు కనీసం 150 పని దినాలు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో యాక్టివిటీ/ ప్రాజెక్టు బేస్డ్ బోధనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
గత సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆన్‌లైన్, డిజిటల్ విధానంలో విద్యా బోధనను ప్రారంభించిన నేపథ్యంలో ముందుకు ఎలా సాగాలన్న విషయంలో వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి యాక్టివిటీ/ ప్రాజెక్టు ఆధారిత విద్యా బోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్‌ను విద్యాశాఖ జారీచేసింది. ఇందులో తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా యాక్టివిటీ/ ప్రాజెక్టు ఆధారిత విద్యా బోధనను వెల్లడించింది. ప్రతి తరగతిలో పాఠ్యాంశంలో సాధించాల్సిన లక్ష్యాలను పేర్కొనడంతో పాటు విద్యార్థులకు కోర్ కాన్సెప్ట్స్‌ను నేర్పించేలా చర్యలు చేపట్టాలని కోరింది. తద్వారా టీవీ పాఠాలను, వీడియో పాఠాలను, ఆన్‌లైన్ పాఠాలను వినే విద్యార్థులపై భారం లేకుండా చూడాలని నిర్ణయించింది. 30 శాతం వరకు సిలబస్‌ను తగ్గించేలా చర్యలు చేపడుతోంది. అయితే కరోనా పరిస్థితులను బట్టి ముందుకు సాగాలన్న అభిప్రాయంతో ఉంది. జాతీయ స్థాయిలో విద్యా బోధనకు సంబంధించి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో పాఠశాల విద్య విధానాన్ని కొనసాగించేలా ఆలోచనలు చేస్తోంది. అయితే కరోనా అదుపులోకి వస్తే కనీసంగా 150 రోజుల పనిదినాలు ఉండేలా చూడాలన్న భావనకు వచ్చింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తరువాతే పరీక్షలకు సంబంధించిన కార్యాచరణను అమలు చేయాలని భావిస్తున్నారు.
డిగ్రీ కోర్సుల్లోనూ సిలబస్ కుదించే యోచన
అన్‌లాక్ నిబంధనలు డిసెంబర్ 2వ తేదీ వరకు ఉండనున్నాయి. ఆలోగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్కూళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం ప్రత్యక్ష విద్యాబోధనపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పించినా, కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ మొదటివారం నాటికి పరిస్థితులు అనుకూలిస్తే ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. కరోనా కారణంగా పనిదినాలు నష్టపోయిన నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లోనూ 30 శాతం వరకు సిలబస్‌ను తగ్గించేందుకు ఉన్నత విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం సెలవులో ఉన్న కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ రాగానే దీనిపై చర్చించి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. వీలైతే ఈనెలాఖరులో ప్రత్యక్ష విద్యాబోధనకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. అయితే దీనిపై సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Published date : 12 Nov 2020 04:57PM