Skip to main content

కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మొదటి విడత నోటిఫికేషన్ శనివారం విడుదల చేసింది.
బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (బీఎస్సీ నర్సింగ్‌) నాలుగేళ్ల డిగ్రీ కోర్స్, పోస్ట్‌ బేసిక్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ రెండేళ్ల డిగ్రీ కోర్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్ ఇన్ మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. తుది మెరిట్‌ జాబితాను, సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. పీడబ్ల్యూడీ అభ్యర్థులతో సహా అర్హులైన అభ్యర్థులు కోర్సు, కళాశాల వారీగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in లో చూడాలని ఒక ప్రకటనలో తెలిపింది.
Published date : 08 Mar 2021 03:32PM

Photo Stories