క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం http://rdhrms.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 19 Sep 2020 02:23PM