Skip to main content

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షల ఖాళీలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులుండగా 2018మార్చి 1 నాటికి అందులో 31,18,956 ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 2019-20 ఏడాదికి గాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) లు సుమారు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు చేశాయన్నారు.
Published date : 06 Feb 2020 04:10PM

Photo Stories