Skip to main content

కేజీబీవీల్లో ఆరో తరగతి, ఇంటర్‌ 2021– 22 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: ఏపీలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)ల్లో 2021–22 విద్యా సంవత్సరానికి గానూ 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు.
అలానే అన్ని కేజీబీవీల్లో 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్‌ (బడి మానేసినవారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెచ్‌టీటీపీఎస్‌.ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌ లైన్‌ ద్వారా జూన్‌ 3వ తేదీ నుంచి 20 తేదీ వరకు వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్‌ కోసం పరిగణిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే కేజీబీవీల్లో పదో తరగతి చదువుతున్న బాలికలు 11వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సందేహాలు ఉంటే 94943 83617 లేదా 94412 70099 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Published date : 02 Jun 2021 01:50PM

Photo Stories