జూనియర్ కాలేజీల్లో 3,970 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 74 కేటగిరీల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 3,970 ఉద్యోగ నియామకాలకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది.
2020-21 విద్యాసంవత్సరంలో నిర్దేశించిన పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అర్హులను నియమించుకోవాలని ఇంటర్ విద్యా కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఆగస్టు 28న ఉత్తర్వులిచ్చారు.
Published date : 29 Aug 2020 03:33PM