Skip to main content

జూన్‌ 21న ఏపీపీఎస్సీ నియామక ధ్రువపత్రాల పరిశీలన

సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈనెల 21వ తేదీన పరిశీలించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు పేర్కొన్నారు. ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలోని అసిస్టెంట్‌ డైరెక్టర్, టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్, గ్రౌండ్‌ వాటర్‌ విభాగం అసిస్టెంట్‌ కెమిస్ట్, ఏపీ పోలీసు ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకుఎంపికైన వారి ధ్రువపత్రాలను కమిషన్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలనుంచి పరిశీలిస్తారని తెలిపారు.
Published date : 05 Jun 2021 01:56PM

Photo Stories