జూలైలోపు డిగ్రీ, పీజీ తరగతులు పూర్తి!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు వేగవంతం చేసింది.
జూలైలోగా ఈ విద్యా సంవత్సరపు బోధనను పూర్తి చేసి, విద్యా సంవత్సరాన్ని ముగించేలా అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేస్తోంది. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి సోమవారం వర్సిటీ రిజిస్ట్రార్‌లతో సమావేశం అయ్యారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకే ముందుగా తరగతులు ప్రారంభించాలని రిజిస్ట్రార్‌లు సూచించారు. మిగతా సంవత్సరాల వారికి ఆన్‌లైన్ బోధనను కొనసాగించాలని పేర్కొన్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులే హాస్టళ్లలో ఉండేలా అనుమతిస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. జూలైలోపు ఈ విద్యా సంవత్సరాన్ని పూర్తి చేస్తే సెప్టెంబర్ నెలలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించవచ్చనే అంచనాకు వచ్చారు.
Published date : 19 Jan 2021 04:09PM