జూలై 1 నుంచి స్కూల్లకు ఆన్‌లైన్ తరగతులు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీలు, గురుకులాల్లో పని చేసే టీచర్లు జూన్ 16వ తేదీ నుంచి స్కూళ్లకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
జూలై 1 నుంచి డిజిటల్/ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఈనెల 9న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించిన అనంతరం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే టీచర్లు ఈ నెల 16 నుంచి స్కూళ్లకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు టీచర్లు డిజిటల్/ఆన్‌లైన్ తరగతుల బోధనకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారని, అందుకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు ఇంటర్మీడియెట్ తరగతులను ఈనెల 16 నుంచి కాకుండా జూలై 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలిసింది.
చదవండి: టీఎస్ ఎడ్‌సెట్ నిబంధనల సవరణ 2021: ఇక ఆ అభ్యర్థులూ బీఎడ్‌కు అర్హులే..
చదవండి: టీఎస్ ఎడ్‌సెట్ నిబంధనల సవరణ 2021: ఇక ఆ అభ్యర్థులూ బీఎడ్‌కు అర్హులే..
Published date : 14 Jun 2021 07:11PM