జనవరి 10వ తేదీలోగా నిరక్షరాస్యుల జాబితా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభం కానున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు పైబడి చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యుల జాబితాను ఈ నెల 10లోగా రూపకల్పన చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం బీఆర్‌కేఆర్ భవన్ నుంచి పల్లె ప్రగతి రెండో విడతపై జిల్లా కలెక్టర్లతో ఆయన టెలికాన్ఫరెన్‌స నిర్వహించారు. రాష్ట్రంలో వయోజనుల అక్షరాస్యతను పెం పొందించేందుకు ప్రత్యేక ప్రచారోద్యమం నిర్వహించాలని సూచించారు. అక్షరాస్యత పెంపునకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఈచ్ వన్- టీచ్ వన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామానికి సంబంధించిన నిరక్షరాస్యుల జాబితాలో 18 ఏళ్లకు పైబడిన అందరి వివరాలుండాలని, జాబితా ను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఈ నిరక్షరాస్యుల వివరాలు సేకరించడానికి సంబంధిత నమూనాను జిల్లా కలెక్టర్లకు పంపించామని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సెన్సెస్ డెరైక్టర్ ఇలంబర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Published date : 02 Jan 2020 03:24PM