Skip to main content

జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులు మంజూరు చేయాలి

సాక్షి, హైదరాబాద్: జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన చేపట్టబోయే ముందే జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
జోనల్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలపై శుక్రవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆ సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, పలువురు నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియ ద్వారా ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరారు. మల్టీజోనల్‌ కేడర్‌కు సంబంధించిన పోస్టులకు రిక్రూట్‌ మెంట్‌ సమయంలో మల్టీజోనల్‌గా నియమించినా రాష్ట్ర స్థాయిలో పనిచేయడానికి అవకాశం కల్పించా లని విజ్ఞప్తి చేశారు.

చ‌ద‌వండి: ‘నాడు–నేడు’తో మారిన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు 

చ‌ద‌వండి: 15 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం: ధర్మేంద్ర ప్రధాన్ 

చ‌ద‌వండి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పెరిగిన ప్రవేశాలు: సబిత ఇంద్రారెడ్డి 

ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చూడాలని కోరారు. పదోన్నతులకు సంబంధించి మూడేళ్ల కనీస సర్వీసును రెండేళ్లకు తగ్గిస్తూ శాశ్వత ఉత్తర్వులు జారీ చేయాలని, రెండేళ్ల సర్వీసు పూర్తి కాగానే పదోన్నతి కల్పించాలన్నారు. ఈ జోనల్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ నష్టం జరగకుండా చూస్తానని ఉద్యోగ సంఘాలకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. మూడేళ్ల నుంచి రెండేళ్ల సర్వీసును కుదిస్తూ ప్రమోషన్ల ఉత్తర్వుల జారీకి, పీఆర్సీలోని వ్యత్యాసాలను సమర్పించడానికి అనామలీస్‌ కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత స్కీం అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కాగా, జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజనకు ముందే జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాలకు అదనపు పోస్టులివ్వాలని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ కోరింది. దీనిపై సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు సంఘం అధ్యక్షులు రాజేందర్, ప్రతాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 14 Aug 2021 04:10PM

Photo Stories