Skip to main content

జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2,300 కోట్లు!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది.
ఇటీవల వైఎస్సార్ నవశకంలో భాగంగా నిర్వహించిన సర్వేలో కొత్తగా 95,887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు. ఇంటర్, ఆపైన చదువుతూ.. స్కాలర్‌షిప్‌లు తీసుకునే ప్రతి విద్యార్థీ ఈ పథకానికి అర్హుడు. ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌కు జమచేస్తారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10,65,357 మంది కాగా.. కొత్తగా 95,887 మంది విద్యార్థులు నమోదవడంతో ఆ సంఖ్య 11,61,244కు చేరింది. త్వరలోనే వీరికి వసతి దీవెన కార్డులు అందచేస్తారు. ఈ పథకానికి ఇంతవరకూ ఏటా మెయింటెనెన్స్ ఫీజుల కింద ప్రభుత్వం రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.2,300 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అంటే అదనంగా రూ.1,500 కోట్లు ఖర్చుచేయాలి. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు సంవత్సరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించింది. అందుకే ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతోంది.
Published date : 06 Jan 2020 04:22PM

Photo Stories