Skip to main content

‘జగనన్న అమ్మ ఒడి’తో.. పేదల ఇంట విద్యా క్రాంతి!!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద తల్లుల ఇళ్ల ముంగిటకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం విద్యా సంక్రాంతిని తెచ్చింది.
తమ పిల్లల చదువుల కోసం ప్రతీ పేద తల్లికి ఏటా రూ.15వేలు అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకంపట్ల వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక స్థోమతలేని తాము పిల్లలను చదివించుకోవడానికి ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందంటున్నారు. జనవరి 9న పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి సోమవారం వరకు 41 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమచేయించారు. మిగిలిన వారి ఖాతాల్లో మంగళవారం జమచేశారు. ఈ నేపథ్యంలో.. అమ్మఒడి సాయం అందుకున్న తల్లులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమకు ఈ ఏడాది సంక్రాంతి ముందే వచ్చిందంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Published date : 16 Jan 2020 12:15PM

Photo Stories