జేఈఈలో తెలంగాణ విద్యార్థుల జయకేతనం..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ మార్చి సెషన్‌లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు.
మొత్తంగా 100 ఎన్‌టీఏ స్కోర్ సాధించిన విద్యార్థులు 13 మంది ఉంటే.. అందులో తెలంగాణ విద్యార్థులే ముగ్గురు ఉండటం గమనార్హం. రాష్ట్రానికి చెందిన బన్నూరు రోహిత్‌కుమార్‌రెడ్డి, మాడూరు ఆదర్శ్‌రెడ్డి, జోష్యుల వెంకట ఆదిత్య 100 ఎన్‌టీఏ స్కోర్ సాధించారు. రాష్ట్రస్థాయిలో వారే టాపర్లుగా నిలిచారు. జేఈఈ జనరల్ కేటగిరీ టాపర్లు 12 మందిలోనూ ఈ ముగ్గురు నిలిచారు. మొత్తంగా ఐదు కేటగిరీల్లో రాష్ట్ర విద్యార్థులు టాపర్లలో చోటు సంపాదించారు. అయితే ఎస్సీ కేటగిరీలో ఒక్క విద్యార్థి కూడా లేకపోగా, ఎస్టీ కేటగిరీలోని ఐదుగురిలో నలుగురు తెలంగాణ విద్యార్థులే ఉన్నారు. ఐదు కేటగిరీల్లో.. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రెండో సెషన్ జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 6.19 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు 5.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో 100 ఎ¯న్‌టీఏ స్కోర్ సా«ధించినవారిలో తెలంగాణ విద్యార్థులు ఒక్కరూ లేకపోగా.. మార్చి పరీక్షల్లో ముగ్గురు నిలిచారు. మిగతా కేటగిరీల్లోనూ పలువురు రాష్ట్ర విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. మరోవైపు ఏప్రిల్‌లో నిర్వహించే మూడో విడత, మేలో నిర్వహించే నాలుగో విడత జేఈఈ మెయిన్ కోసం.. ఈనెల 25 నుంచి రిజిస్ర్టేషన్లను ప్రారంభించేందుకు ఎన్‌టీఏ చర్యలు చేపడుతోంది.
ఇంకా చదవండి: జేఈఈ మెయిన్ మార్చి సెషన్ కటాఫ్ ఎక్కువుండే అవకాశం
ఇంకా చదవండి: జేఈఈ మెయిన్ మార్చి సెషన్ కటాఫ్ ఎక్కువుండే అవకాశం
ఎన్‌టీఏ స్కోర్ | విద్యార్థి పేరు |
ఓపెన్ కేటగిరీలో.. | |
100 | బన్నూరు రోహిత్‌కుమార్‌రెడ్డి |
100 | మాడూరు ఆదర్శ్‌రెడ్డి |
100 | జోష్యుల వెంకట ఆదిత్య |
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో.. | |
99.9925414 | మన్నెం చరణ్ |
99.9868762 | గంగిశెట్టి కృష్ణ సాయికుశల్ |
ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో.. | |
99.99786 | తెర్లి తులసీరామ్ |
ఎస్టీ కేటగిరీలో.. | |
99.97216 | ఇస్లావత్ నితిన్ |
99.92825 | నేనావత్ ప్రీతమ్ |
99.91647 | బిజిలి ప్రచోతన్‌వర్మ |
99.66097 | మూడే రిషినాయక్ |
వికలాంగుల కేటగిరీలో.. | |
99.8625495 | మల్లుకుంట్ల భానురంజన్‌రెడ్డి |
మహిళల కేటగిరీలో.. | |
99.993571 | దొంతిరెడ్డి హన్వితరెడ్డి |
99.986079 | పల్లె భావన |
Published date : 25 Mar 2021 04:29PM