Skip to main content

జేఈఈ మెయిన్‌లో ప్రభుత్వ గురుకులాల సత్తా

సాక్షి, అమరావతి/గుర్ల (చీపురుపల్లి): జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌లో ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
బీసీ సంక్షేమ గురుకులాల నుంచి మొత్తం 104 మంది పరీక్ష రాయగా 34 మంది అర్హత సాధించారు. తామిచ్చిన ప్రత్యేక శిక్షణ వల్ల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. జేఈఈ అడ్వాన్స్ డ్‌కు, ఎంసెట్‌కు కూడా శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

జేఈఈ అడ్వాన్స్ డ్ 2020 సిలబస్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల హవా
సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకులు సాధించారు. మొత్తం 462 మంది పరీక్ష రాయగా 195 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాలకు సంబంధించి మొత్తం 227 మంది మెయిన్ రాయగా 146 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులకు ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వడంతోపాటు జేఈఈ కోసం అకాడమీలు, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు.
Published date : 14 Sep 2020 02:13PM

Photo Stories