జేఈఈ మెయిన్ బీ ప్లానింగ్‌లో ఏపీ, టీఎస్ విద్యార్ధులకు 100 పర్సంటైల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం జనవరి 6న నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జనవరి 23 (గురువారం)నవిడుదల చేసింది.
బీ ప్లానింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనుమూరి భీమేశ్వర విజయ వర్మ 100 పర్సంటైల్ సాధించారు. బీఆర్క్‌లో 100 పర్సంటైల్ ఇద్దరు విద్యార్థులకు లభించగా అందులో తెలంగాణ నుంచి హార్దిక్ రాజ్‌పాల్ ఉన్నారు. మరొకరు హరియాణాకు చెందిన ఆర్జూ అనే విద్యార్థి ఉన్నారు. అలాగే బీఈ/బీటెక్‌లో హార్దిక్ రాజ్‌పాల్ 99.97 పర్సంటైల్ సాధించారు. బీఆర్క్ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 1,38,410 మంది దరఖాస్తు చేసుకోగా 1,12,679 మంది హాజరయ్యారు. బీ ప్లానింగ్ కోసం 59,003 మంది దరఖాస్తు చేసుకోగా 44,517 మంది హాజరయ్యారు. ఇక ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్ష కోసం వచ్చే నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
Published date : 24 Jan 2020 01:35PM