జాతీయ విద్యావిధానంతో పట్టభద్రులకు ఉపాధి
ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ నైపుణ్య శిక్షణ అందించాలని నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతన జాతీయ విద్యా విధానం-2020పై నిర్వహించిన ఆన్‌లైన్ సెమినార్‌లో సచివాలయంలోని తన చాంబర్ నుంచి మంత్రి పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడారంటే..
- విద్యకు ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్ అధిక నిధులు కేటాయిస్తున్నారు.
- జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఆర్థిక భరోసా అందిస్తున్నారు.
- సెమినార్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధ్దికి పెద్దపీట
సీఎం జగన్ దార్శనికతతో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశారని మంత్రి సురేష్ అన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఇంక్యుబేషన్ సెంటర్, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్ల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను మంత్రి వెబినార్ ద్వారా ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధికి జేఎన్టీయూ ఇంక్యుబేషన్ సెంటర్ బాటలు వేస్తుందన్నారు. ప్రతిష్టాత్మకమైన పార్టనర్ షిప్ 2020 గ్రాంట్ కింద అమెరికా ప్రభుత్వం నుంచి 45 వేల డాలర్ల సాయాన్ని పొందినందుకు ఉపకులపతి ప్రొఫెసర్ రామలింగరాజును అభినందించారు.
జగనన్న గోరుముద్ద సక్రమంగా అమలుకావాలి
జగనన్న గోరుముద్ద పథకం సక్రమంగా అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న బోజన) పథకంపై సచివాలయంలోని చాంబర్లో అధికారులతో సమీక్షించారు.