ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మూడో విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జడ్చర్ల, షాద్‌నగర్ డిగ్రీ కాలేజీల్లో ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్లకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా.. తాజాగా మిగిలిన సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు ఓఎస్డీ సుస్మిత (6300427220)ను సంప్రదించాలని సొసైటీ సూచించింది.
Published date : 25 Mar 2021 04:35PM