ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం: ఈ సారి45 రకాల కోర్సులు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు సోమవారం ఆలస్యంగా మొదలయ్యాయి.
ఆదివారం అర్ధరాత్రి నుంచే వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో విద్యార్థులు ఆప్షన్లను ఇచ్చుకునే ప్రక్రియ మొదలుకాలేదు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఇక ఈనెల 20తో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కానుండగా, 22తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 51,880 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. మరోవైపు కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పులతో తరువాత కన్వీనర్ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్‌లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లు ఉన్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్‌లో మొత్తంగా 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది.
ప్రవేశాల కమిటీ ప్రకటించిన కొత్త కోర్సులు,ప్రధాన బ్రాంచీల్లోని సీట్ల వివరాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స 126 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స అండ్ డాటా సైన్‌స 168, సీఎస్‌ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స అండ్ మిషన్ లెర్నింగ్) 5,310, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 126, కంప్యూటర్ ఇంజనీరింగ్ 42, కంప్యూటర్ సైన్‌స అండ్ బిజినెస్ సిస్టమ్స్ 252, సీఎస్‌ఈ(సైబర్ సెక్యూరిటీ) 1,806, సీఎస్‌ఈ (డాటా సైన్స్) - 3,213, సీఎస్‌ఐటీ 336, సీఎస్‌ఈ (నెట్ వర్క్స్) 126, సీఎస్‌ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్ ఇంజనీరింగ్ 210, సీఎస్‌ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్ 5,980, మైనింగ్ 328 సీట్లు.

Published date : 20 Oct 2020 06:10PM