ఇంగ్లిష్ నైపుణ్యాలకు ప్రాధాన్య పాయింట్లు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలంటున్నారు.. తమ పిల్లలకు ఇంగ్లి ష్ చదువులు చెప్పించాలని కోరుతున్నారు.. దీనికి అనుగుణంగా విద్యా శాఖ కూడా చర్యలు చేపడుతోంది.
అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఇంగ్లిష్ మీడియం బోధించే నైపుణ్యాలు ఎంత మందిలో ఉన్నాయి.. నైపుణ్యాలు కలిగిన వారిని ఎలా గుర్తించాలి? వారు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో బోధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలని తర్జనభర్జ న పడుతోన్న విద్యా శాఖకు ఎట్టకేలకు ఓ ఆలోచన తట్టింది. టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలపై పరీక్ష నిర్వహించి, ఆ నైపుణ్యాలు కలిగిన వారి ని గుర్తించి ముందుకు సాగితే ఉపయోగంగా ఉం టుందన్న ఆలోచనకు వచ్చింది. అంతేకాదు వారిని ప్రోత్సహించి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో బోధించేలా చేసేందుకు వారికి ప్రాధాన్య పాయింట్లు ఇ స్తే బాగుంటుందని భావిస్తోంది. విద్యాశాఖ నిర్వహించే పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ పాయింట్లను (రెగ్యులర్‌గా వారికి వచ్చే పాయింట్లకు అదనంగా) వారి బదిలీలు, పదోన్నతుల్లో ఉపయోగించుకునేలా చూడటం ద్వారా ఆయా టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో వారు మరింత బాగా పనిచేస్తారని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో వారి సేవలను సద్వినియోగపరచుకోవచ్చని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్న ఆలోచన చేస్తోంది. త్వరలోనే దీ నిపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణ యం తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది.
ప్రైమరీ స్కూళ్లు ఇంగ్లిష్ వైపు..
రాష్ట్రంలో 26,754 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిల్లో 1,21,657 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లు 14,170 మంది ఉండగా, సబ్జెక్టు కాకపోయినా మరో 20 వేల మం ది వరకు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న టీచర్లు ఇంగ్లిష్ కూడా నేర్పించాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఇంగ్లిష్ టీచర్లు కాకుండా మిగతా వారిలో ఎంత మందికి ఇంగ్లిష్ మీడియంలో బోధించే నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకునే చర్యలకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. ఇంగ్లి ష్ మీడియం కావాలంటున్న తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం 2018 నుంచే రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ఏర్పాటుకు ఓకే చెప్పింది. దీంతో రాష్ట్రంలో 18,230 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, అందులో 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు 6 వేల ప్రాథమిక పాఠశాల ల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. మరోవైపు 4 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లలో 2008లోనే ప్రారంభమై కొనసాగుతోంది. ఇప్పుడు ఇంకా ఇంగ్లిష్ మీడియం కావాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుం చి వస్తోంది. అందుకే ఇప్పుడున్న స్కూళ్లలో ఇంగ్లి ష్ మీడియం సెక్షన్ ప్రారంభించడం లేదా ఇంగ్లిష్ మీడియానికి మార్పు (కన్వర్షన్) చేసే అధి కారాన్ని డీఈవోలకు అప్పగించేలా ఇటీవల రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.
ఇంగ్లిష్ మీడియంలో 37.82 శాతం..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,87,563 మంది విద్యార్థులు చదువుతుండగా, అందులో 10,16,334 మంది (37.82 శాతం) విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇక తెలు గు మీడియంలో చదువుతున్న విద్యార్థులు 15,44, 208 మంది ఉన్నారు. ఇక 10,549 ప్రైవేటు స్కూళ్లలో 96.94 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతుండగా, మిగతావారు ఇతర మీడియంలలో చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 31,22,927 మంది ఉండగా, అందులో 30,27,459 మంది ఇంగ్లిష్ మీడియం వారే.
రాష్ట్రంలో మొత్తం స్కూళ్లు, టీచర్ల వివరాలు

కేటగిరీ | స్కూళ్లు | టీచర్లు |
ప్రాథమిక | 18,230 | 40,750 |
ప్రాథమికోన్నత | 3,179 | 15,257 |
ఉన్నత | 4,641 | 47,042 |
కేజీబీవీ, ఇతర | 704 | 18,608 |
మొత్తం | 26,754 | 1,21,657 |
Published date : 13 Jan 2020 03:54PM