ఇక సీబీఎస్‌ఈ అఫిలియేషన్ మంజూరు ప్రక్రియ అన్‌లైన్‌లోనే..!
Sakshi Education
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరిధిలో ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు గుర్తింపు (అఫిలియేషన్) మంజూరు ప్రక్రియలో పలు మార్పులు చేసినట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది.
అఫిలియేషన్ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జాతీయ నూతన విద్యా విధానం-2020 ప్రకారం సీబీఎస్‌ఈ బైలాలో పలు మార్పులు చేసింది. ఈ విషయాలతో తన అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా ఒక నోటిఫికేషన్ పొందుపరిచింది. 2021 మార్చి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వివిధ కమిటీల సిఫార్సుల మేరకు నూతన విద్యా విధానంలో చేసిన సూచనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది.
పునర్వ్యవస్థీకరణ లక్ష్యం ఇలా..
సీబీఎస్‌ఈ గుర్తింపు మంజూరుకు 2006 నుంచి ఆన్‌లైన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా డిజిటలైజేషన్, డేటా అనలటిక్స్ ఆధారంగా తక్కువ మానవ వనరుల వినియోగంతో గుర్తింపు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఎస్‌ఈ వివరించింది. త్వరితగతిన గుర్తింపు పొందడం, ఆటోమేటెడ్, డేటా డ్రైవన్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకత పెంచడం, మొత్తం అఫిలియేషన్ విధానంలో అకౌంట్‌బిలిటీని పెంచడం, త్వరితంగా, కాల పరిమితిలోగా దరఖాస్తులను పరిష్కరించడం లక్ష్యంగా కొత్త విధానాన్ని చేపడుతున్నట్టు పేర్కొంది. ఇందుకు పూర్తి నిర్దేశిత సమయాలను పాటించనుంది. ఆయా విద్యాసంస్థలు అవసరమైన డాక్యుమెంట్లను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది.

Published date : 27 Jan 2021 04:55PM