ఇబ్బందుల్ని అధిగమిస్తేనే విజయతీరాలను చేరగలం!
Sakshi Education
తాము జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమ పిల్లలకు అటువంటి పరిస్థితి రాకూడదనేదే తమ తమ కోరికని అనేకమంది తల్లిదండ్రులు అంటూఉంటారు. అయితే వాస్తవానికి ఇది సరైన వాదన కాదు.
ఈ సందర్భంలో ఓ కథ చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. తాను ఒక చక్కని విగ్రహం చెక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా అడవిలోకి వెళ్లాడు. వెతకగా వెతకగా రెండు పెద్దరాళ్లు కనిపించాయి. అవి తాను చెక్కాలనుకున్న శిల్పానికి సరిపోయేలా ఉన్నాయి. దీంతో ముందు ఒకరాయి వద్దకు వెళతాడు. తన చేతిలోని ఉలి తీసుకొని దానిలో ఒక శిల్పం వద్దకు వెళతాడు. ఉలితో దెబ్బ వేయబోతుండగా ఆ రాయి శిల్పితో ఇలా అంటుంది. ‘‘విగ్రహం చెక్కడం కోసం నాపై దెబ్బలు కొట్టకు. నేను తట్టుకోలేను. మరో రాయి చూసుకొని పని మొదలుపెట్టుకో’’ అంటూ ఉచిత సలహా ఇస్తుంది. దీంతో రెండో రాయి వద్దకు వెళతాడు. అది ఏమీ అనదు. దీంతో పని మొదలుపెడతాడు. దెబ్బ మీద దెబ్బ వేస్తుంటాడు. అయినప్పటికీ రెండో రాయి అన్ని దెబ్బలను తట్టుకొంటుంది. ఒకరోజంతా కష్టపడిన తర్వాత ఆ రాయికి దేవుడి రూపం వస్తుంది. ఇక మిగిలిపోయిన రెండో రాయిని శిల్పి దేవుడి పాదాల దగ్గర ఉంచుతాడు. ఆ తర్వాత ప్రతిరోజూ భక్తులు రావడం, రెండో రాయిపై కొబ్బరికాయలు కొట్టడం మొదలవుతుంది. దీంతో మొదటిరాయి అందరి పూజలు అందుకొంటుండగా రెండో రాయి అందరి పాదాల కింద నలిగిపోతూనే ఉంది. కొబ్బరికాయ దెబ్బలు తింటూనే ఉంది. ఈ కథలోని నీతి ఏమిటంటే లేత వయసులో కష్టపడితే జీవితాంతం సుఖపడొచ్చు. లేత వయసులో సుఖపడితే జీవితాంతం అనేక ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Published date : 07 Feb 2020 02:32PM