ఈ ఏడాది కూడా నో ఎగ్గామ్స్..వీళ్ల అంతా పాస్
Sakshi Education
చెన్నె: కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
9, 10, 11వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఫిబ్రవరి 25వ తేదీన పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా రెండో దశ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు కొందరు చెప్తున్నారు.
గతేడాదిలాగే ఈ ఏడాది కూడా...
ప్రతిరోజూ అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కేరళలో కూడా హైస్కూల్ పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉంది.

Published date : 27 Feb 2021 12:55PM