ఈ బడిలో బొమ్మలే పాఠాలు చెబుతాయి...
Sakshi Education
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంరంగాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతుండేది.
అయితే కాలక్రమేణా హాజరు తగ్గిపోయిన కారణంగా అది కాస్తా మూతపడే స్థితికి చేరుకుంది. ఇక లాభం లేదనుకున్న ప్రధానోపాధ్యాయుడు, గ్రామ సర్పంచ్ గతేడాది చొరవ తీసుకున్నారు. దాతల సహకారంతో పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. గోడలపై ఆకర్షణీయమైన బొమ్మలు వేయించారు. దీంతో ఈ బడికి పూర్వవైభవం మొదలైంది. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు సైతం ఈ బడి బాట పట్టారు.
ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. కొన్ని సందర్భాల్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను ఉపయోగిస్తారు. అయితే ఈ బడిలో మాత్రం చాలా వరకు బొమ్మలే పాఠాలు చెబుతాయి. లెక్కలు, ఎక్కాలు నేర్పిస్తాయి. జాతీయ నాయకులు, ప్రముఖుల గొప్పదనం గురించి వివరిస్తాయి. వివిధ వస్తువులు, పరికరాలు, జంతువులు, ప్లానెట్, ప్రకృతి, పరిసరాలు పర్యావరణం గురించి తెలియజేస్తాయి. దీంతో విద్యార్థులు ఎంచక్కా బొమ్మలు చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగాయపల్లి ప్రాథ మిక పాఠశాల...విద్యార్థులు రాకపోతుండడం తో మూతపడే పరిస్థితికి చేరుకుంది. దీంతో సర్పంచ్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దాతల సహకాంతో గతేడాది పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. చేసే పనికి కాస్త యినా న్యాయం చేయాలనే తపనే ఆ ఉపాధ్యా యులను కదిలించింది. ప్రైవేటుకు దీటుగా ఎందుకు ఉండకూడదని అనుకొన్నారు. తమ ఆలోచనకు పదునుపెట్టారు. బడి చుట్టూ, లోపల భాగంలో అందమైన బొమ్మలు వేయించారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. హంగు ఆర్బాటాలతో అదరగొట్టే ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపించేందు కు తల్లిదండ్రులు ఆసక్తిని కనబరిచే రోజులివి. అయితే వృత్తి పట్ల అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు సర్కా రు బడిని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మార్చారు. గ్రామస్తుల సహకారంతో ప్రైవేటు బడులకు వెళ్లే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దారు.
ఆకట్టుకునేలా..:
పాఠశాల బడి గోడలు చిన్నారులను ఆకర్షించేలా తీర్చిదిద్దారు. వివిధ రకాల చిత్రాలు విజ్ఞానాన్ని పంచుతున్నాయి. పిల్లలు అమితంగా ఇష్టపడే బొమ్మలు, జంతువుల చిత్రాలు, పంటపొలాలు, అంకెలు, ఎక్కా లు, గుర్తులు, పండ్లు, పక్షులు, రాష్ట్రాలు, పర్యావరణ ప్రతిరూప చిత్రాలు, జ్ఞానాన్ని పెంచే చిత్రాలు పిల్లలను ఆకట్టుకుంటున్నాయి.
సులువుగా అర్థమవ్వాలనే...
విద్యార్థులు పుస్తకాల్లో చదివి నేర్చుకునే బదులు గోడలపై విషయాన్ని చూసి నేర్చుకుంటే సులువుగా అర్థమవుతుందనే ఆలోచనతో భావన తో చిత్రాలు వేయించాం. విద్యార్థులు వీటిని చూసి చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఈ చిత్రాల వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుంది.

Published date : 04 Feb 2020 04:42PM