Skip to main content

హెచ్‌సీయూలో ఏఐ డిప్లొమా కోర్సు ప్రవేశాలు

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరో డిప్లొమా కోర్సుకు శ్రీకారం చుట్టింది.

హెచ్‌సీయూలోని సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ ద్వారా కృత్రిమ మేధస్సు, మెషీన్‌ లెర్నింగ్‌లో డిప్లొమా కోర్సు కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ కోర్సును ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషన ల్స్, మార్కెటింగ్, సేల్స్‌ప్రొఫెషనల్స్‌ కోసం రూపొందించారు. గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 10+2 గణితంతో డిగ్రీ చేసిన వారు అర్హులు. పరిశ్రమల, ఆన్‌లైన్‌ వీడియోలు, ఆన్‌లైన్‌ లైవ్‌ ఇంటరాక్టివ్‌ సెషన్లతో మిశ్రమ పద్ధతిలో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏఐ, డేటా అనాలిసిస్, విజువలైజేషన్, మెషీన్‌ లెర్నింగ్, డీప్‌ లెర్నింగ్‌ సహా మొత్తం 43 క్రెడిట్లతో 5 సబ్జెక్టులు, ప్రాజెక్టు వర్క్‌ల ప్రొగ్రాం కాన్సెప్ట్‌లు ఉంటాయి.
Published date : 20 Aug 2021 07:18PM

Photo Stories