హెచ్4 వీసాదారుల ఉద్యోగాలు కాపాడండి!
Sakshi Education
వాషింగ్టన్: హెచ్4 వీసాహోల్డర్ల వర్క్ ఆథరైజేషన్ పత్రాల కాలపరిమితి పెంచాలని, వీరి విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను తొలగించాలని 60 మంది యూఎస్ చట్ట సభ్యులు కాబోయే అధ్యక్షుడు జోబెడైన్‌కు విజ్ఞప్తి చేశారు.
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగానికి వచ్చినవారి జీవిత భాగస్వాములకు, 21 ఏళ్లలోపు పిల్లలకు హెచ్4 వీసాలను అమెరికా పౌరసత్వ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) జారీ చేస్తుంది. వీరిలో అత్యధికులు భారతీయ ఐటీ ఉద్యోగులే ఉంటారు. హెచ్4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేసే అవకాశం గతంలో లేదు. 2015లో ఈ వీసా నిబంధనలను సడలించడంతో వీరు సైతం యూఎస్‌లో ఉద్యోగాలు చేసే వీలు కలిగింది.
Published date : 19 Dec 2020 03:56PM