గణితంతో ఉజ్వల భవిష్యత్తు: మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్
Sakshi Education
సాక్షి, అమరావతి: మనిషి జీవితం అంకెలు, సంఖ్యలతో ముడిపడి ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు చెప్పారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఫిబ్రవరి 15 (శనివారం)నవిజయవాడలో రాష్ట్రస్థాయి మ్యాథ్స్ ఒలింపియాడ్ నిర్వహించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బీసీ గురుకులాలు, వసతి గృహాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. పిల్లలకు సులువుగా గణిత శాస్త్రాన్ని బోధించగలిగితే జీవితంలో మరింత రాణిస్తారన్నారు. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో విద్యార్థులను గ్రూపులుగా విభజించి, పోటీలు నిర్వహించారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
Published date : 17 Feb 2020 03:30PM