Skip to main content

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు వేతనం పెంపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో మూడు కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాన్ని ప్రభుత్వం పెంచింది.
గతంలో వీరికి రూ.17,755 వేతనం ఇస్తుండగా దాన్ని 23,500కు పెంచారు. మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్ కమ్ సపోర్ట్ స్టాఫ్‌కు ఈ వేతానాల పెంపు వర్తిస్తుంది. కొత్త వేతనాలు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి అమలుకానున్నాయి.
Published date : 12 Mar 2020 02:34PM

Photo Stories