ఎప్పుడూ... మంచివారితోనే స్నేహం చేయాలి!!
Sakshi Education
పాఠశాలలో అనేక రకాల స్వభావాలు కలిగిన విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు.
వారిలో కొంతమంది మంచివాళ్లు, మరికొంతమంది చెడ్డవాళ్లు ఉంటారు. ఎవరు ఎలాంటి వారైనా తోటి విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హంసలా పాలను, నీళ్లను వేరుచేయగలగాలి. మంచివారిని, మనకు ఉపయోగపడేవారిని గుర్తించి వారితో స్నేహం చేయాలి. అందుకే ‘‘ నీ స్నేహితులెవరో చెప్పు. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా’ అని అంటారు. మన స్నేహమే మన ఎదుగుదలకు, లేదా పతనానికి దారితీస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వం కలిగినవారితో స్నేహం చేస్తే వారి భావాలు, వారి ఆలోచనలు మన ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అలాకాకుండా అందరి వెంట తిరిగితే మాత్రం అందుకు తగ్గ ఫలితాలు వస్తాయి. మనకు మంచి జరిగినా, చెడు జరిగిన అందుకు ఇతరులు కారణం కాదు. మనమే కారణం. ఎందుకంటే అందుకు బాధ్యులం మనమే కనుక. అందువల్ల ఏ పనిచేసే ముందైనా మంచి. చెడులు ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కష్టాలు తెచ్చిపెడుతుంది. విద్యార్థి అంటే కేవలం సిలబస్ మొత్తం చదివేసి పరీక్షలు రాసేవాడు మాత్రమే కాదు. ఆదర్శవంతుడై ఉండాలి. ఆదర్శవంతుడైన విద్యార్థి మాత్రమే ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలుగుతాడు. అటువంటివారిని చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందివారు ఆ మారా్గన్ని ఎంచుకుని ముందుకు సాగుతారు.
Published date : 10 Feb 2020 03:41PM