ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించాల్సిన బోధన రుసుం (ఫీజు రీయింబర్స్‌మెంట్) రూ.49,47,00,000 మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి వేల కోట్లు బకాయి ఉంచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాలను కొద్దికొద్దిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది.
Published date : 03 Nov 2020 04:27PM