Skip to main content

ఏపీలో ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తెలుగు మాధ్యమం కోరుకునే వారికోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలుగు మాధ్యమం పాఠశాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 15 విడుదల చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవీ ...
  • మండల కేంద్రంలో తెలుగు మాధ్యమం పాఠశాలను నిర్వహించేందుకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి స్కూల్‌ను గుర్తించాలి
  • తెలుగు మీడియం పాఠశాల గురించి ఆ మండలంలో ప్రచారం చేయాలి.
  • తెలుగు మాధ్యమ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయ హేండ్‌బుక్స్ రూపకల్పనకు ఎస్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటుంది.
  • ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతో పాటు అన్ని మైనర్ మీడియం పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలి.
  • ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మీడియం పాఠశాలలు (ప్రైవేట్ యాజమాన్యం మినహా) వాటి వాటి మాధ్యమాల్లో కొనసాగవచ్చు.
Published date : 24 Mar 2020 02:56PM

Photo Stories