ఏపీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు ప్రారంభం
Sakshi Education
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): నిరుద్యోగ యువత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు శ్రీసిటీలోని ఆల్‌స్ట్రామ్ మెట్రో రైలు బోగీల తయారీ పరిశ్రమలో తొలివిడతగా ప్రారంభమయ్యాయి.
మంగళవారం నైపుణ్యాభివృద్ధి కేంద్ర శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆనంతరాము, నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీ చక్రధర్‌బాబు, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఆల్‌స్ట్రామ్ ఎండీ విజయ సుబ్రమణియన్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆల్‌స్ట్రామ్ పరిశ్రమలో తొలివిడతగా 30 మంది డిప్లొమా ఇంజినీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఆ పరిశ్రమ ముందుకు రావడం అభినందనీయమన్నారు. 45 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.
Published date : 21 Oct 2020 01:54PM