ఏపీఎస్‌ఎస్‌డీసీలోఅంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సంస్థ చైర్మన్ చల్లా మధసూదన్‌రెడ్డి అన్నారు.
తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ యాక్టివిటీ పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు సర్టిఫికేషన్ పొందే అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులకు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఏపీఎస్‌ఎస్‌డీసీ, యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ (ఈసీఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 అప్లయిడ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్స్‌లో 1,000 మందికిపైగా శిక్షణ పొందారన్నారు. వీరందరికీ ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇన్ మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లో అదనపు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.
Published date : 19 Feb 2021 03:13PM