ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీగా జయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవోగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి బుధవారం బాధ్యతలు చేపట్టారు.
అనంతరం ఆమె సిబ్బందితో మాట్లాడుతూ.. స్థానికంగా ఉండే యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ పాత్ర కీలకమైనదని అన్నారు. అంతకు ముందు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తన పదవీ బాధ్యతలను జయలక్ష్మికి అప్పగించారు.
Published date : 11 Feb 2021 04:03PM