Skip to main content

ఏపీ సంక్షేమ శాఖల్లో షిఫ్ట్‌ల వారీగా విధుల నిర్వహణ

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సంక్షేమ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
సోమవారం నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌లు.. ఉద్యోగుల విధులు, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
  • రాష్ట్ర కార్యాలయాల్లో తక్కువ మంది సిబ్బందితో రెండు షిఫ్టులుగా విధులు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు నిర్ణయించారు.
  • అత్యవసరమైతే తప్ప ప్రజలు కార్యాలయాలకు రావద్దని ఉన్నతాధికారులు సూచించారు.
  • ఏవైనా సమస్యలు ఉంటే సంక్షేమ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ దృష్టికి తీసుకు రావాలని, విలేజ్ వలంటీర్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని అధికారులు తెలిపారు.
  • పభుత్వ కార్యాలయాల్లో కూడా ఒకరికి ఒకరికి మధ్య మూడు అడుగుల దూరం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
  • హెచ్‌వోడీల ఆధ్వర్యంలో తరుచూ నిర్వహించే సమావేశాలు వారం రోజుల పాటు ఆపివేశారు.
  • పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు సంక్షేమ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి విద్యార్థులను ఉంచాలనే ఆలోచనకు అధికారులు స్వస్తి చెప్పారు. విద్యార్థులందరినీ ఇంటికి పంపించారు.
  • విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
Published date : 24 Mar 2020 02:07PM

Photo Stories