ఏపీ సెట్ 2020 ఫలితాలు విడుదల... 7.88 శాతం అర్హత
Sakshi Education
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్లో 7.88 శాతం మంది అర్హత సాధించినట్టు ఏపీ సెట్–2020 మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేసి ఏపీ సెట్ వెబ్‌సైట్‌లో పొందు పరిచినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 20న 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు. పరీక్షకు 26,527 మంది హాజరవగా 2,090 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. త్వరలో విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతి ప్రాంతీయ కేంద్రాల్లో సర్టిఫికెట్లను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Published date : 23 Feb 2021 04:58PM