ఏపీ ఈసెట్–2020లో 19,245 మందికి సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఈసెట్–2020 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు కేటాయించినట్లు కనీ్వనర్ ఎం.ఎం.నాయక్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నవంబర్ 21 నుంచి 26 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వివరించారు. ఈసెట్‌లో 30,662 మంది అర్హత సాధించగా, రెండో విడత కౌన్సెలింగ్‌కు 1,713 మంది రిజిస్టర్ చేసుకోగా.. ధ్రువపత్రాల పరిశీలనకు 2,572 మంది హాజరయ్యారు. మొత్తం 10,787 ఆప్షన్లు నమోదు చేశారు. మొదటి విడతలో సీట్లు వచి్చన వారిలో 2,342 మంది రెండో విడత స్లయిడింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 4,636 మందికి రెండో విడతలో సీట్ల కేటాయింపు చేసినట్లు కనీ్వనర్ వివరించారు.
Published date : 01 Dec 2020 04:27PM