‘ఎన్జీరంగా’ పీజీ ప్రవేశ పరీక్ష - 2020 ఫలితాలు విడుదల
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ కోర్సు ప్రవేశ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉన్నత విద్య అభ్యర్థులకు అఖిల భారత ప్రవేశ పోటీ పరీక్ష (ఏఐఈఈఏ)లో సాధించిన మార్కులు 50 శాతంతో పాటు ప్రతిభ ప్రాతిపదికన సీట్లు కేటాయించారన్నారు. వివిధ విభాగాల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశామని తెలిపారు. పాలకమండలి సభ్యుడు డాక్టర్ వి.చెంగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విభాగంలో 34 సీట్లకు గానూ 31 సీట్లు వ్యవసాయ ఇంజనీరింగ్, సాంకేతికత విభాగాల్లో నాలుగు సీట్లకు గానూ మూడు సీట్లు, సామాజిక విజ్ఞానశాస్త్రం విభాగాల్లో రెండు సీట్లు అభ్యర్థులు సాధించగా..మిగిలిన సీట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని వివరించారు.
Published date : 04 Dec 2020 04:24PM