Skip to main content

ఎన్‌ఐటీలో ఏప్రిల్ 3 వరకు తరగతులు రద్దు

సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఎఫెక్ట్‌తో తరగతులు సహా పాఠ్య కార్యక్రమాలన్నింటినీ వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఏప్రిల్ 3వ తేదీ వరకు రద్దు చేసింది.
తదుపరి కార్యక్రమాలను తమ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వరంగల్ ఎన్‌ఐటీ డెరైక్టర్ ఎన్‌వీ రమణారావు వెల్లడించారు. రాష్ట్రంలో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యా సంస్థలు సెలవులు పాటించాల్సిందేనని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసిన నేపథ్యంలో వెంటనే ఎన్‌ఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వీలైనంత వరకు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, ముందస్తు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ప్రయాణ సంబంధ ఇబ్బందులు ఉన్నవారు తెలియజేయాలని, విదేశీ విద్యార్థులు హాస్టళ్లలోనే ఉండాలని తెలిపింది.

టెన్‌‌త విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిందే
ఈనెల 31వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 19 నుంచి ప్రారంభం అయ్యే పదో తరగతి పరీక్షలకు ఇళ్లలోనే సిద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు. తరగతుల నిర్వహణ, పాఠ్యాంశాల రివిజన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా పరీక్షలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే నెల 7 నుంచి 16వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 31 తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తగిన చర్యలు చేపట్టవచ్చని వెల్లడించారు.
Published date : 16 Mar 2020 05:47PM

Photo Stories