Skip to main content

ఎంసెట్‌తో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు

ఏజీ యూనివర్సిటీ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ఎంసెట్‌ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు.
గతంలో బీఎస్సీ హోంసైన్స్ గా పిలిచే ఈ కోర్సును ఇప్పుడు బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్ గా మార్చినట్లు తెలిపారు. బాలికలకే అర్హత ఉన్న ఈ కోర్సులకు ఇకపై బాలురకు కూడా అర్హత కల్పించామని వెల్లడించారు. ఎంసెట్‌లో ప్రతిభ అధారంగా ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 50:50 ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఎంసెట్‌ ఫలితాల తర్వాత బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పారు.
Published date : 27 Mar 2021 03:06PM

Photo Stories