ఏఎన్‌యూకి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021కి సంబంధించి యూనివర్సిటీలకు ప్రకటించిన ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని పొందింది.
ర్యాంకు ఖరారు చేస్తూ ఆ సంస్థ ఏఎన్‌యూకి అధికారిక సమాచారమిచ్చింది. ఏఎన్‌యూలో ఆగస్టు 28న వీసీ ఆచార్య పి.రాజశేఖర్, వర్సిటీ ఆన్‌లైన్ ర్యాంకింగ్స్ కోఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిశోర్ ర్యాంకు వివరాలను వెల్లడించారు. ఏడాది కాలంలో అత్యధిక ర్యాంకులు సాధించిన ప్రభుత్వ వర్సిటీల కేటగిరీలో ఏఎన్‌యూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
Published date : 29 Aug 2020 03:17PM