Skip to main content

ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలల మూసివేత

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా, ముందు జాగ్రత్తగా ప్రైమరీ స్కూళ్లను ఈ నెలాఖరు వరకు మూసివేస్తు న్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ సెలవులు ప్రభుత్వ, ఎయిడెడ్, ఎంసీడీ, ఎన్డీఎమ్‌సీ ప్రైమరీ స్కూళ్లకు వర్తించనున్నాయి.
Published date : 06 Mar 2020 01:54PM

Photo Stories